- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం సెంట్రల్ అడ్మిషన్స్ కమిటీ డైరెక్టర్ డా. వనజా ఉదయ్ గురువారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం సెంట్రల్ అడ్మిషన్స్ కమిటీ డైరెక్టర్ డా. వనజా ఉదయ్ గురువారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జూలై 23న ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు బిఎఫ్ఏ, ఎంపీఏ డ్యాన్స్, ఎంపీఏ ఫోక్ ఆర్ట్స్, మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు ఎంఏ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పరీక్షలు జరగనున్నాయి.
బిఎఫ్ఏ, ఎంపిఏ డ్యాన్స్, ఎంపిఏ ఫోక్ ఆర్ట్స్ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష ముగిసిన వెంటనే.. అంటే అదే రోజు మధ్యాహ్నం 12.00 గంటల నుంచి నాంపల్లి ప్రాంగణంలోనే ప్రాక్టికల్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని డైరెక్టర్ తెలిపారు. బిఎఫ్ఏ ప్రాక్టికల్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట డ్రాయింగ్ బోర్డు, అవసరమైన పెన్సిళ్లను తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను జూలై 16 నుండి www.pstucet.org వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్ణీత సమయానికి కేంద్రానికి చేరుకోవాలని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.






