- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ స్థాయిలో ఏపీకి రెండో ర్యాంక్
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (PMGSY) పనుల అమలులో ఏపీ జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ...

దిశ, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (PMGSY) పనుల అమలులో ఏపీ జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. అంతేకాదు నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పరిశీలనలు చేసింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పనులను పూర్తి చేసింది. దీంతో ఈ గుర్తింపు సాధ్యమైంది. రాష్ట్రంలో రోడ్ల నాణ్యతను మెరుగుపరచడానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. కొన్ని ప్రాంతాల్లో పనులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. అధికారులకు తగిన సూచనాలు చేశారు. దీంతో పనుల్లో నాణ్యతా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి.
గత ప్రభుత్వంతో పోలిస్తే..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్ర ర్యాంకులో భారీ మార్పు లభించింది. గతంలో రాష్ట్రం ఈ పథకం అమలులో దేశంలోనే 19వ స్థానంలో ఉండగా, తాజా నివేదికల ప్రకారం ఏపీ ఏకంగా రెండో స్థానానికి చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.






