- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
25 ఏళ్ల రైతుల కల నెరవేర్చాం - తూడి మేఘా రెడ్డి
గోపాల్ పేట రేవల్లి ఏదుల మండలాల నూతన వ్యవసాయ మార్కెట్ యార్డుల పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది

దిశ, గోపాల్ పేట: గండి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం ఉమ్మడి గోపాల్ పేట రేవల్లి ఏదుల మండలాల నూతన వ్యవసాయ మార్కెట్ యార్డుల పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గ సభ్యులను అభినందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దాదాపు 25 సంవత్సరాలుగా మార్కెట్ యార్డులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు నూతన వ్యవసాయ మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసి వారి కలను నిజం చేసిందన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల గురించి గొప్పలు చెప్పుకున్నప్పటికీ, వనపర్తి నియోజకవర్గంలో ఒక్క కొత్త మార్కెట్ యార్డును కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రైతుల కష్టాలు పట్టించుకోని వారు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధికారులు గోపాల్పేట ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సుఖేందర్ రెడ్డి, సుల్తాన్, సర్పంచులు పరశురాముడు, లోకా రెడ్డి, బంగారయ్య, రవి, నాయకులు శివన్న,కొంకి వెంకటేష్,చంద్రశేఖర్, ధన్వాడ నాగరాజ్, మేస్త్రి బాలయ్య, కొంకి రమేష్,రవి, మల్లేష్, మండ్ల ఆంజనేయులు, మధుకర్, శ్రీశైలం, బ్యాదరీ శాంతయ్య,వెంకట్ రెడ్డి,కృష్ణయ్య, మెడికల్ రాజు,మల్లేష్, శివ, వెంకటయ్య, పర్వతాలు, నాగరాజు,కార్యకర్తలు యువకులు, పెద్దలు రైతులు మహిళలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






