లష్కర్ బోనాల జాతరకు పటిష్ట బందోబస్తు

by Taduka Kalyani |

ఆగస్టు 2,3వ తేదీలో సికింద్రాబాద్ లష్కర్ లో జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సికింద్రాబాద్ డిసిపి రక్షిత మూర్తి వెల్లడించారు.

లష్కర్ బోనాల జాతరకు పటిష్ట బందోబస్తు
X

దిశ, బేగంపేట: ఆగస్టు 2,3వ తేదీలో సికింద్రాబాద్ లష్కర్ లో జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సికింద్రాబాద్ డిసిపి రక్షిత మూర్తి వెల్లడించారు. గురువారం సోమ సుందరం వీధిలోని విశ్వకర్మ సంఘంలో అన్ని శాఖల అధికారులతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బోనాల కోసం రెండు ప్రత్యేక క్యూ లైన్ లు, సాధారణ భక్తుల కోసం నాలుగు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆలయ ప్రాణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు సీసీ కెమెరా నిఘాలో ఉంటుందన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలు, దొంగతనాలు జరగకుండా పోలీసులు మఫ్టీలో ఉంటారని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలను పరిశీలించి వెంటనే చర్యలు కూడా తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఏసీపీలు శ్రీధర్, యాదగిరి, శ్రీనివాస్, శంకర్ రాజు,సిఐలు రవి కుమార్,సురేష్ తో పాటు పోలీసు సిబ్బంది , మహంకాళి ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి,నూతన ట్రస్టు బోర్డు సభ్యులు, మక్తాల ఫౌండేషన్ అధ్యక్షుడు జలంధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story