​హుజురాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికుల ఆందోళన, 3 గంట‌లుగా !

by velandi.Saikiran |

హుజురాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

​హుజురాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికుల ఆందోళన, 3 గంట‌లుగా !
X

దిశ,​ హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ వెళ్లే బస్సులు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు మూడు గంటలుగా కరీంనగర్‌కు వెళ్లే ఒక్క బస్సు రాలేదు. దీంతో విసుగు చెందిన ప్రయాణికులు.. బస్టాండ్ ఆవరణలోనే బస్సులకు అడ్డంగా నిలబడి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ప్రయాణికులతో మాట్లాడి వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.

​అటు ఈ ఘటనపై బస్సు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ స్పందించారు. వరంగల్ వైపు నుంచి రావాల్సిన బస్సులు సాంకేతిక, ఇతర కారణాల వల్ల సకాలంలో చేరుకోకపోవడం వల్లే ఈ ఆలస్యం జరిగిందని వివరించారు. ప్రయాణికుల ఇబ్బందులను గమనించి, తక్షణమే కరీంనగర్ వెళ్లేందుకు ప్రత్యేక (స్పెషల్) బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డిపో మేనేజర్ హామీతో ప్రయాణికులు శాంతించి, తమ నిరసనను విరమించుకున్నారు. దీంతో పరిస్థితి తిరిగి అదుపులోకి వచ్చింది.

Next Story