కిరాణా షాపులో చోరీ

by velandi.Saikiran |

కిరాణా షాపులో చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను గురువారం మంథని పోలీస్ లు పట్టుకున్నారు

కిరాణా షాపులో చోరీ
X

దిశ, మంథని : కిరాణా షాపులో చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను గురువారం మంథని పోలీస్ లు పట్టుకున్నారు.మంథని సీఐ బుద్ద స్వామి తెలిపిన కథనం ప్రకారం... మంథని మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన బండెల స్వరూప కిరాణా షాపు నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తుంది.ఈ నెల 5 న తన కిరాణా షాపును మూసి,షాపు ముందు ఉన్న ఇంట్లో నిద్రించారు.మరుసటి రోజు ఉదయం షాపు తెరిచి చూడగా గేటు,షాపు తాళాలు పగలగొట్టి ఉంది.షాపులోని 50 వేల నగదును దొంగిలించారు. ఈ విషయం పై పోలీసులకు సమాచారం ఇవ్వగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టం జరిగింది.ఈ రోజు ఉదయం మంథని బస్ డిపో వద్ద వాహన తనిఖీలో ఉన్న సమయంలో, పైన పేర్కొన్న ఇద్దరు నిందితులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు.మంథని ఎస్.ఐ. ఎన్.సందీప్ కుమార్ నేతృత్వంలోని పోలీసు బృందం పట్టుకుని విచారణ చేయగా సదరు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించారు.నిందితుల వద్ద నుండి దొంగిలించిన బైకును స్వాధీనపరచుకొని నిందితులని రిమాండ్ కి తరలించడం జరిగింది.నిందితులు ఇదివరకు కూడా దొంగతనాలకు పాల్పడిన హాబిచ్యువల్ ఆఫెండర్లు అని తెలిసింది.గతంలో మంథని పోలీస్ స్టేషన్ పరిధి తో పాటు సుల్తానాబాద్, పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌ లలో ఇప్పటికే కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు.

Next Story