- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఒకటో తారీఖునే జీతాలు ఇస్తాం : మంత్రి దామోదర్ రాజనర్సింహ
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని వివిధ ఏజెన్సీలలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలను ప్రతినెల మొదటి తేదీనే విడుదల చేస్తామన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని వివిధ ఏజెన్సీలలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలను ప్రతినెల మొదటి తేదీనే విడుదల చేయాటానికి కార్మికులు చేసిన విజ్ఞప్తిపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు విడుదల చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలను విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏజెన్సీల ద్వారా వేతనాలు తీసుకుంటున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలను తప్పనిసరిగా ఒకటో తేదీనే అందించేందుకు కృషి చేస్తామన్నారు. అందుకు ఐహెచ్ఎఫ్ఎంఎస్ పోర్టల్ పాలసీలో సవరణలను తీసుకురావటానికి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.






