ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ ప్రవేశాల గడువు పెంపు

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలోని ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు టీజీ సెట్స్ అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ ప్రవేశాల గడువు పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు టీజీ సెట్స్ అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 లోగా తమ సర్టిఫికేట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల జాబితా ప్రదర్శన ఏవైనా సవరణలు ఉంటే ఈమెయిల్ ద్వారా తెలిపేందుకు ఈ నెల 18న అవకాశం కల్పించారు. ఈ నెల 19 నుండి 21 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 22న వెబ్ ఆప్షన్ల సవరణ ఉంటుందన్నారు. మొదటివిడత సీట్ల కేటాయింపు ఈ నెల 26న ఉంటుంది. సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, రిపోర్టింగ్ కు ఈ నెల 27 నుండి 30 వరకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలకు కోసం [email protected] ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని కన్వీనర్ తెలిపారు.

Next Story