- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి షూటింగ్ షెడ్యూల్ మనకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పుతుంది.. రాశిఖన్నా ఎమోషనల్ పోస్ట్
ఈ సినిమా షెడ్యూల్ ముగిసిన తర్వాత నాకు ఆ అలసట ఏమాత్రం గుర్తుకు రావడం లేదు.. కేవలం అందరిపై ఉన్న కృతజ్ఞతాభావం మాత్రమే మిగిలింది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రాశీఖన్నా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంతో పాటు.. హిందీలో ఓ భారీ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించబోతోంది. టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాకు సీనియర్ డైరెక్టర్ అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ నటి విద్యాబాలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్, అనీస్ బాజ్మీ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ముగిసింది. ఈ విషయాన్ని తెలుపుతూ రాశీ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ నోట్‌ను పంచుకున్నారు. "ప్రతి షూటింగ్ షెడ్యూల్ మనకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పుతుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. మన చుట్టూ ఉండే మనుషుల నుంచే మనకు నిజమైన బలం వస్తుందని ఈ షెడ్యూల్ నాకు మరోసారి గుర్తుచేసింది. షూటింగ్ మధ్యలో అనారోగ్యం బారిన పడటం అనేది ఎవరికైనా చాలా కష్టమైన విషయం.
ఒకానొక దశలో శారీరకంగా నన్ను నేను చాలా పుష్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ అలాంటి సమయంలో నా మేనల్లుడి నుంచి వచ్చిన ఒక చిన్న హగ్, ఫ్యామిలీ మెంబర్స్ చేసిన ఫోన్ కాల్స్, అలాగే సెట్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి నువ్వు బాగున్నావా? అని అడిగిన పలకరింపులు నా కష్టాన్ని దూరం చేశాయి. ఆ ప్రేమతో నా రోజంతా ఎంతో తేలికగా మారిపోయేది" అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాలో కొన్ని భారీ యాక్షన్ సీన్స్ కూడా చేసినట్లు రాశీ ఖన్నా హింట్ ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఒంటిపై కొన్ని దెబ్బలు కూడా తగిలాయని, తాను చేసిన కెరీర్ లోనే ఇది అంత సులువైన షెడ్యూల్ ఏమీ కాదని ఆమె అన్నారు. అయితే, ఇదంతా ఎంతో మంది మంచి మనసున్న మనుషుల మధ్య జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. "ఈ సినిమా షెడ్యూల్ ముగిసిన తర్వాత నాకు ఆ అలసట ఏమాత్రం గుర్తుకు రావడం లేదు.. కేవలం అందరిపై ఉన్న కృతజ్ఞతాభావం మాత్రమే మిగిలింది. కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా ఇవే జ్ఞాపకాలు నా జీవితాంతం నాతో పాటే ఉండిపోతాయి" అంటూ రాశీ ఖన్నా రాసుకొచ్చారు.






