పలుచటి చీరలో గ్లామర్ మెరుపులు మెరిపించిన సాక్షి అగర్వాల్

by Pulgam srinivas |   (  Updated:2026-07-09 08:59:46  IST  )

బ్లాక్ శారీలో గ్లామర్ షో.. సాక్షి అగర్వాల్ ఫొటోలు వైరల్.

పలుచటి చీరలో గ్లామర్ మెరుపులు మెరిపించిన సాక్షి అగర్వాల్
X

దిశ, వెబ్‌ డెస్క్: కోలీవుడ్‌లో గ్లామర్ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాక్షి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

2013లో విడుదలైన 'రాజా రాణి' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ భామ, అనేక తమిళ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అలాగే తమిళ 'బిగ్ బాస్ 3'లో పాల్గొని మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.

తమిళంతో పాటు కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సాక్షి అగర్వాల్ తరచూ తన గ్లామరస్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట సందడి చేస్తుంటుంది.

తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రాల్లో సాక్షి పలుచటి నలుపు రంగు చీరకు మ్యాచింగ్‌గా బ్లాక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి ఎంతో స్టైలిష్‌గా కనిపించింది.

చేతులకు నల్లటి గాజులు, నుదుటిపై చిన్న బొట్టు, చెవులకు స్టైలిష్ ఇయర్‌రింగ్స్‌తో తన అందాన్ని మరింత హైలైట్ చేసింది. అలాగే గాలికి వదిలిన కురులతో కెమెరాకు ఆమె ఇచ్చిన హోయలపోయే ఫోజులు అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మొత్తంగా సాక్షి తాజా గ్లామర్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Photos Courtesy: Instagram

Next Story