- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుగాలి ప్రీతి తల్లి పార్వతమ్మ వైసీపీ ట్రాప్‌లో పడ్డారు: కిరణ్ రాయల్
సుగాలి ప్రీతి తల్లి పార్మతమ్మ వైసీపీ ట్రాప్‌లో పడ్డారని తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సుగాలి పార్వతమ్మ కేసు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. ..

దిశ, వెబ్ డెస్క్: సుగాలి ప్రీతి తల్లి పార్మతమ్మ వైసీపీ(Ycp) ట్రాప్‌లో పడ్డారని తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్(Tirupati Janasena Incharge Kiran Rayal) అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)పై సుగాలి పార్వతమ్మ(Sugali Parvathamma) కేసు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. కర్నూలు సభతో సుగాలి ప్రీతి తల్లి పార్వతమ్మకు న్యాయం జరిగినందుకా పవన్ కల్యాణ్ పై కేసు పెట్టారని ప్రశ్నించారు. పవన్ పిలుపుతోనే తామంతా కర్నూలు సభకు వచ్చామని తెలిపారు. కర్నూలు సభ తర్వాత సుగాలి ప్రీతి తండ్రికి ఉద్యోగం.. తల్లి పార్వతమ్మకు స్థలం వచ్చిందని గుర్తు చేశారు. ఇవన్నీ చేసినందుకే పవన్ కల్యాణ్‌పై కేసు పెట్టారా అని నిలదీశారు. రావణ్, శ్రవణ్ కూడా వైసీపీ టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. రావణ్, శ్రవణ్ మీటింగుల్లో వైసీపీ నేతలు ఉన్నారని, ఇప్పుడెలా సంబంధంలేదని చెబుతారని నిలదీశారు. రావణ్, వైసీపీకి సంబంధం లేదని చెప్పిన పెద్దిరెడ్డి పక్కనున్న వ్యక్తి ఎవరు అని కిరణ్ రాయల్ ప్రశ్నించారు.






