తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితులపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

by Ajay Maddhiboyina |

తెలంగాణ‌లో ఎల్‌నినో పరిస్థితులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు కార్యాచరణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వ్యవసాయ, నీటిపారుదలశాఖ సమన్వయంతో కార్యచరణ ప్రణాళిక రచించాలని సూచించారు.

తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితులపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో ఎల్‌నినో పరిస్థితులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు కార్యాచరణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వ్యవసాయ, నీటిపారుదలశాఖ సమన్వయంతో కార్యచరణ ప్రణాళిక రచించాలని సూచించారు. సాగునీటి సభ్యత, నీటి నిల్వలు, ప్రంటల ప్రణాళికపై చర్చించారు. ఎల్‌నినోపై రాష్ట్రప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రానికి ఎల్‌నినో ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో వర్షాలు తగ్గి కరువు వస్తుందని చెబుతున్నారు. తాగునీటి కొరత, భూగర్భ జలాలు సైతం పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అవుతోంది. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది.

Next Story