కులాంతర వివాహం చేసుకున్న జంటకు ప్రోత్సాహకం

by velandi.Saikiran |

ఉన్నత చదువులతో రాణించాలని, విద్యార్థికి సూచించారు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.

కులాంతర వివాహం చేసుకున్న జంటకు ప్రోత్సాహకం
X

దిశ, గద్వాల కలెక్టరేట్: అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, విద్యార్థులకు సైతం సహకారం అందిస్తున్నందున ఉన్నత చదువులు అభ్యసించి రాణించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఇటిక్యాల మండలం వావిలాల గ్రామానికి చెందిన విద్యార్థి లెవిన్ కుమార్ కు గురువారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత చదువులకు సహాయంగా ల్యాప్టాప్ ను అందజేశారు. అలాగే ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన రమేష్ సురేఖ దంపతులు కులాంతర వివాహం చేసుకోవడంతో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రోత్సాహకంగా రూ.2.50 లక్షల విలువైన ఎఫ్ డి(ఫిక్స్డ్ డిపాజిట్) పత్రాన్ని కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, ఏఎస్సిడబ్ల్యూఓ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Next Story