గుండెపోటుతో మహిళా సర్పంచ్ ఆకస్మిక మృతి

by Batti.Sumithra |

ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జరపు పావని గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.

గుండెపోటుతో మహిళా సర్పంచ్ ఆకస్మిక మృతి
X

దిశ, మోర్తాడ్ : ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జరపు పావని గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, గ్రామ ప్రజలతో కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా పావనికి మంచి గుర్తింపు ఉంది. చిన్న వయసులోనే సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేక తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆమె మృతితో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు తీవ్రవిషాదంలో మునిగిపోయారు.

Next Story