- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖైరిగూడ ఓసీని సందర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే
బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఉపరితల బొగ్గు గనిని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గురువారం సందర్శించారు.

దిశ, రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఉపరితల బొగ్గు గనిని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీరమేష్ వారికి స్వాగతం పలికారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి గనిని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యేలకు గని ఉత్పత్తి, ఉత్పాదకత, పని ప్రదేశాల వివరాలను జీఎం వివరించారు.
సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ గోడం నగేష్ కొనియాడారు. బెల్లంపల్లి ఏరియాలో గనుల అభివృద్ధి, ఉత్పత్తి పెంపునకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే గోలేటి ఉపరితల గనిని త్వరగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరిగూడ ప్రాజెక్టు అధికారి మచ్చగిరి నరేందర్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, ఇన్‌చార్జి మేనేజర్ గౌతమ్ రాజేష్ రెడ్డి, సీనియర్ పర్సనల్ అధికారి రజనీకుమార్, జీఆర్‌ఎన్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






