- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులో మునిగి మత్స్యకారుడి దుర్మరణం
చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన చెల్పూర్ లో చోటు చేసుకుంది.

దిశ, హుజురాబాద్ రూరల్: చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన ఈ ర్ల రవీందర్ (55)అనే మత్స్యకారుడు గురువారం చేపలు పట్టేందుకు చెల్పూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువుకు వెళ్లాడు. చెరువులో వల విసురుతుండగా ప్రమాదవశాత్తు రవీందర్ కాలికి ఉన్న బేడికి , షర్ట్ గుండి వలలో చిక్కుకుపోయింది. దీంతో అతను నిలదొక్కుకోలేక నీటిలో మునిగిపోయాడు.
అక్కడే ఉన్న అతని భార్యాపిల్లలు, సమీపంలోని ఇతర మత్స్యకారులు గమనించి వెంటనే చెరువులోకి దిగి రవీందర్‌ను బయటకు తీశారు. అప్పటికే అతను తీవ్రంగా నీరు మింగడంతో స్థానికులు ప్రథమ చికిత్స అందించి, 108 అంబులెన్స్ ద్వారా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, పరీక్షించిన వైద్యులు రవీందర్ అప్పటికే ఊపిరాడక మృతి చెందినట్లు ధృవీకరించారు. కళ్లెదుటే ప్రాణాలు పోవడంతో భార్యాపిల్లల రోదనలు అక్కడి వారిని కలచివేశాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






