- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎంపీ రఘునందన్ ఆగ్రహం
సంగారెడ్డిలో కొత్తగా ప్రారంభించిన ఈఎస్ఐ డిస్పెన్సరీ కార్యక్రమానికి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా తనకు ఆహ్వానం లేకపోవడంపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.

దిశ, సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డిలో కొత్తగా ప్రారంభించిన ఈఎస్ఐ డిస్పెన్సరీ కార్యక్రమానికి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా తనకు ఆహ్వానం లేకపోవడంపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంగారెడ్డిలో గురువారం జర్నలిస్టుల మహాసభ కార్యక్రమానికి హాజరైన ఎంపీ రఘునందన్ రావు అక్కడే ఉన్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తో చర్చించడం చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డిలో గురువారం మంత్రులు గడ్డం వివేక్, దామోదర్ రాజనర్సింహలు ఈఎస్ఐ డిస్పెన్సరీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోవడం పట్ల రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, సమాచారం ఇవ్వని జిల్లా సంబంధిత అధికారులకు నోటీసులు పంపిస్తానని, ఈ ఘటనపై త్వరలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పార్లమెంటు స్పీకర్ కు ఫిర్యాదు చేసి అధికారులను ఢిల్లీకి పిలిపిస్తానని హెచ్చరించారు.






