- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యోమగామి శిక్షణలో తొలిమెట్టు సాధించిన జెపిఎన్సీఈ విద్యార్థి
భారతదేశం అంతరిక్ష యాన వ్యోమగామి శిక్షణలో జెపిఎన్సీఈ విద్యార్థి యాదయ్య తొలిమెట్టు సాధించాడు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: భారతదేశం అంతరిక్ష యాన వ్యోమగామి శిక్షణలో తొలిమెట్టు సాధించిన తెలంగాణ బిడ్డ, మహబూబ్ నగర్ జెపిఎన్సీఈ కళాశాల విద్యార్థి కె.యాదయ్య అని కళాశాల చైర్మెన్ కెఎస్ రవికుమార్ గర్వంగా చెప్పారు. గురువారం జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల 30 వసంతాలు పూర్తి చేసుకున్న వేడుకల్లో భాగంగా, అమెరికాలో స్థిరపడిన 5 గురు జెపిఎన్సీఈ పూర్వ విద్యార్థులు, ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ (ఐఏఎం)లో శిక్షణ పూర్తి చేసిన కె. యాదయ్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మెన్ కెఎస్ రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. జెపిఎన్సీఈ చరిత్రలో నేడు గొప్ప సుదినం అని, తమ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థి కే.యాదయ్య కళాశాల ఆణిముత్యం అన్నారు.
అంతరిక్ష యాన నౌకను నడపడానికి మానవ అంతరిక్ష యాన కార్యక్రమం కింద ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణుడయ్యాడని తెలిపారు. రోదసీ యాత్రల కోసం ఆయన జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, ఇంజనీరింగ్ వంటి అంశాలలో కఠినమైన శిక్షణ పొందారని వివరించారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల విజయమని, యాదయ్య ఎన్నో విజయాలను సాధించాలన్నారు. ఇటీవలే హైదరాబాద్ లో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి యాదయ్య కు ప్రశంసా పత్రాన్ని అందజేశారని తెలిపారు. జెపిఎన్సీఈ కళాశాల విద్యార్థులు నేడు దేశాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుండడం శ్లాఘనీయమని, ఇది తమకెంతో గర్వకారణమని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, ఎన్.సీ.సీ ఏఎన్ఓ లెఫ్టినెంట్ డా. గురు రాఘవేంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






