భారత క్రికెటర్లకు ఆ పరిస్థితి రావొద్దు.. కీలక వ్యాఖ్యలు చేసిన అశ్విన్

by Harish |

భారత ప్లేయర్లలో అభద్రతా భావాన్ని కలిగించే పరిస్థితి రాకూడదని, భారత జట్టుకు అది చాలా ప్రమాదకరమని భారత మాజీ క్రికెటర్ ఆర్.అశ్విన్ తెలిపాడు.

భారత క్రికెటర్లకు ఆ పరిస్థితి రావొద్దు.. కీలక వ్యాఖ్యలు చేసిన అశ్విన్
X

దిశ, స్పోర్ట్స్ : భారత ప్లేయర్లలో అభద్రతా భావాన్ని కలిగించే పరిస్థితి రాకూడదని, భారత జట్టుకు అది చాలా ప్రమాదకరమని భారత మాజీ క్రికెటర్ ఆర్.అశ్విన్ తెలిపాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడిన అశ్విన్.. ఇటీవల భారత జట్టులో చోటు చేసుకున్న మార్పులపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ‘ఐర్లాండ్‌లో రెండు ఓటముల తర్వాత, ఫామ్ కోల్పోవడంతో శాంసన్‌ను పక్కనపెట్టారు. మరి ఇప్పుడు ఇంగ్లాండ్‌లో కూడా రెండు మ్యాచ్‌లను ఓడిపోయాం. ఇప్పుడు ఎవరి వంతు?. ఇది చాలా తప్పు. భారత క్రికెటర్లు అభద్రతా పరిస్థితుల్లో చిక్కుకోకూడదు. ‘నేను పరుగులు చేయకపోతే బెంచ్‌కే పరిమితం చేస్తారు’అని బ్యాటర్లు ఆలోచిస్తే.. వారు జట్టులో స్థానం కోసం మాత్రమే ఆడటం మొదలుపెడతారు. జట్టు కంటే తమ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఆ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. శాంసన్‌కు మళ్లీ చాన్స్ ఇస్తే.. అతను సొంతంగా ఆలోచించొచ్చు. అది తప్పు అని కూడా అనలేం. కాబట్టి దీనికి ఓ పరిష్కారం కనుక్కుంటారని ఆశిస్తున్నా’అని అశ్విన్ చెప్పాడు.

ఈ సందర్భంగా గతంలో గంభీర్ వ్యాఖ్యలను గుర్తు చేసిన అశ్విన్.. శాంసన్‌ను తప్పించడాన్ని ప్రశ్నించాడు. ‘టెస్టుల్లో సాయి సుదర్శన్‌కు ఎక్కువగా అవకాశాలు ఇచ్చినప్పుడు మీరు చెప్పారు?.. ‘నాలుగు మ్యాచ్‌ల ద్వారా ఒక ప్లేయర్‌పై అంచనా’ రాలేం అన్నారు. అలా చెప్పి నెల కూడా కాలేదు. కానీ మూడు మ్యాచ్‌ల్లో నిరాశపర్చినందుకు శాంసన్‌ను తొలగించారు. అతనికి మరో రెండు అవకాశాలు ఇవ్వాల్సింది. శాంసన్‌కు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఏం ఉంది. అతను వన్డేలు, టెస్టులు ఆడడు. కేవలం టీ20లు మాత్రమే ఆడతాడు. కాబట్టి అతను ఎందుకు విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు? అతనికి రెస్ట్ ఇవ్వడంలో అర్థం ఏంటి?. ఇది అన్యాయం.’అని అశ్విన్ విమర్శించాడు.


Next Story