కేజీబీవీలో గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

by Batti.Sumithra |

నల్గొండ జిల్లా మర్రిగూడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో గెస్ట్ ఫ్యాకల్టీ, జువాలజీ (Zoology) బోధించేందుకు లెక్చరర్ పోస్టులకు అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి నేడుఒక ప్రకటనలో తెలిపారు.

కేజీబీవీలో గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, మర్రిగూడ : నల్గొండ జిల్లా మర్రిగూడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో గెస్ట్ ఫ్యాకల్టీ, జువాలజీ (Zoology) బోధించేందుకు లెక్చరర్ పోస్టులకు అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి నేడుఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ ప్రతులు, అవసరమైన ఇతర పత్రాలతో ఈ నెల 10వ తేదీలోగా మర్రిగూడ కేజీబీవీ పాఠశాలలో ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆమె కోరారు. ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను పాఠశాలలో తెలుసుకోవచ్చని ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు.

Next Story