భార్య, బావమరిదిపై కత్తితో దాడి.. భర్త అరెస్ట్

by Taduka Kalyani |

భార్య, బావమరిదిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ఎం.డి. ఆసిఫ్ గురువారం తెలిపారు.

భార్య, బావమరిదిపై కత్తితో దాడి.. భర్త అరెస్ట్
X

దిశ, మద్దూరు: భార్య, బావమరిదిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ఎం.డి. ఆసిఫ్ గురువారం తెలిపారు. ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామానికి చెందిన బందారం రమేష్ ఈ నెల 15న తన భార్య, పిల్లలను కొట్టినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న భార్య తల్లి, బావమరిది తాళ్లపల్లి ప్రతాప్ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు జాలపల్లి గ్రామానికి వెళ్లగా, వారిపై రమేష్ కత్తితో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై తాళ్లపల్లి ప్రతాప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బందారం రమేష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని, అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ఎం.డి. ఆసిఫ్ వెల్లడించారు.

Next Story