- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జననాయగన్’ సినిమా.. రన్‌టైమ్ ఎంతంటే?
సెన్సార్ పూర్తి చేసుకోగా.. సీబీఎఫ్‌సీ ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా 183నిమిషాల రన్‌టైన్‌తో థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జన నాయగన్’ . ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం, సెన్సార్ పనుల్లో ఆలస్యం కావడం వల్ల రిలీజ్ కాకుండా నిలిచిపోయింది. తాజాగా, అన్ని అడ్డంకులు తొలగిపోగా.. సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాను చూసిన సీబీఎఫ్‌సీ ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రం 183నిమిషాల రన్‌టైన్‌తో థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే రిలీజ్ తేదీ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కెనడాకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ యార్క్ సినిమాస్ పోస్ట్ పెట్టారు. ఎట్టకేలకు మన దళపతి విజయ్ జన నాయగన్ సినిమాతో వెండితెరపై విశ్వరూపం చూపించేందుకు సిద్ధమయ్యారని, జూలై 24 నుంచి కెనడాలో యార్క్ సినిమాస్ ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్‌గా విడుదల చేస్తోందని పోస్ట్‌లో రాసుకొచ్చారు.
అయితే కెనడా కంటే ఒక రోజు ముందుగానే, అంటే జూలై 23నే భారతదేశంలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఈ వార్త తెలియడంతో సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దళపతి విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో, ఆయన కెరీర్‌లో ఇదే చివరి సినిమా కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్‌ఫుల్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ప్రేమలు బ్యూటీ మమితా బైజు, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది.






