- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్ బస్సులపై ఆర్టీవో కొరడా
విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విద్యాసంస్థలు వాహనాలను నడపాలని ఆర్టీవో శివ నాగేశ్వరరావు స్కూల్ యాజమాన్యాలను ఆదేశించారు. గురువారం పట్టణంలో ఆర్టీవో శివ నాగేశ్వరరావు, ఎంవీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులను తనిఖీలు నిర్వహించారు. ..

దిశ, నరసరావుపేట: విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విద్యాసంస్థలు వాహనాలను నడపాలని ఆర్టీవో శివ నాగేశ్వరరావు స్కూల్ యాజమాన్యాలను ఆదేశించారు. గురువారం పట్టణంలో ఆర్టీవో శివ నాగేశ్వరరావు, ఎంవీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులను తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బస్సుల ఫిట్‌నెస్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ డోర్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించారు. అనంతరం ఆర్టీవో శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ స్కూల్ బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా స్కూల్ బస్సులను తనిఖీలు కొనసాగుతున్నాయని శివ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీవో అధికారులు స్కూల్ బస్సులో ప్రయాణించే విద్యార్థులకు అత్యవసర సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.






