మిషన్ భగీరథ నీరు లీకేజీ

by velandi.Saikiran |

వంగూరులోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ ముందు ఉన్న నీటి గుంతలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ నుంచి తాగునీరు లీకవుతూ వృథాగా పోతున్నాయి.

మిషన్ భగీరథ నీరు లీకేజీ
X

దిశ, వంగూరు: వంగూరు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ ముందు ఉన్న నీటి గుంతలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ నుంచి తాగునీరు లీకవుతూ వృథాగా పోతున్నాయి. ఇంత జ‌రుగుతున్నా, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం నుంచి ఈ ప‌రిస్థితి ఉంద‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు. నీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగే ప్రమాదం ఉంద‌ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మిషన్ భగీరథ అధికారులు వెంటనే స్పందించి లీకేజీని గుర్తించి మరమ్మతులు చేపట్టి తాగునీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story