జోగు రామన్న, కంది శ్రీనివాస్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ : బీజేపీ నేతల ఆరోపణ

by Batti.Sumithra |

ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నేత జోగు రామన్న ఒక్కటై రాజకీయ డ్రామాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.

జోగు రామన్న, కంది శ్రీనివాస్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ : బీజేపీ నేతల ఆరోపణ
X

దిశ, ఇచ్చోడ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నేత జోగు రామన్న ఒక్కటై రాజకీయ డ్రామాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు ఎన్రాల నగేష్, జోగు రవి మాట్లాడారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే అక్కడి రైతులు సంబరపడుతున్నారని, తమ భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఆర్ఓబీ, ఆర్‌యూబీ, ఎయిర్‌పోర్టు నిర్మాణాల కోసం ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తుండగా, తమ రాజకీయ ఉనికి దెబ్బతింటుందనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చీకటి ఒప్పందం చేసుకుని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజా భవన్ పేరిట సమీకృత మార్కెట్ యార్డు, సాత్నాల కార్యాలయ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి, నకిలీ డోర్ నంబర్లతో భవంతిని నిర్మించుకున్నారని ఆరోపించారు. ఈ విషయం పై గతంలో మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. త్వరలోనే ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని జోగు రవి అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు హనుమాన్లు, శ్రీకాంత్, పోశాలు, భీమ్‌సేన్ రెడ్డి, విలాస్, సాయి మనోజ్, పవర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story