- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా శంషాబాద్ జోన్ పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ కె. చంద్రకళ అధికారులను ఆదేశించారు.

దిశ, శంషాబాద్: ప్రస్తుతం వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా శంషాబాద్ జోన్ పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ కె. చంద్రకళ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శంషాబాద్ లోని కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ, హైడ్రా , విద్యుత్ శాఖ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బి, పోలీస్ శాఖ, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే అథారిటీ, హెచ్ఎండిఏ, హెచ్ ఆర్ డి సి ఎల్, హెచ్ జి సి ఎల్, ఐ ఆర్ బి ఇన్‌ఫ్రా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ ఏసీపీ, శంషాబాద్ అదనపు డీసీపీ తదితరులు సమావేశానికి హాజరై వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జోన్ పరిధిలో నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని, రహదారులపై గుంతలను తక్షణమే పూడ్చాలని జోనల్ కమిషనర్ ఆదేశించారు. నాలాలు, స్టోర్మ్ వాటర్ డ్రెయిన్లు, డ్రెయినేజీ వ్యవస్థల నిర్వహణను వేగవంతం చేయడంతో పాటు కుంటలు, చెరువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఫిరంగి నాలాతో పాటు ప్రధాన నాలాల్లో డీసిల్టింగ్ పనులను త్వరగా పూర్తి చేసి, వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, తాగునీటి సరఫరా నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. శంషాబాద్ బస్ స్టాండ్ నుంచి రాళ్లగూడ రోడ్డు వరకు హెచ్ ఆర్ డి సి ఎల్ చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ముందస్తు చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని జోనల్ కమిషనర్ స్పష్టం చేశారు. సమావేశంలో శంషాబాద్ డిప్యూటీ కమిషనర్ సుమన్ రావు, వివిధ శాఖలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.






