- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భవిష్యత్ లో ఒకే తాటిపైకి కమ్యూనిస్టు పార్టీలు
భవిష్యత్ లో అన్ని కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఒకే రాజకీయ పార్టీగా ఏర్పడేందుకు ఆలోచనలు జరుగుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

దిశ, భద్రాచలం : భవిష్యత్ లో అన్ని కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఒకే రాజకీయ పార్టీగా ఏర్పడేందుకు ఆలోచనలు జరుగుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. భద్రాచలంలో జరుగుతున్న రాజకీయ శిక్షణ తరగతులు చివరిరోజు ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రజలు కమ్యూనిస్టులను కోరుకుంటున్నారని, ప్రజా క్షేత్రంలో అనేక సమస్యలపై పోరాడటం వలనే ప్రజలు మా పై నమ్మకం ఉంచారని అన్నారు. దేశంలో అంతరాలు లేని సమ సమాజ స్థాపనే కమ్యూనిస్టుల ఏకైక లక్ష్యమని,దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, అరాచక పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. దేశ ప్రజల సంక్షేమం, ఉపాధి, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రజల ప్రయోజనాల కంటే హిందుత్వ ఎజెండా అమలుకే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక సమానత్వం, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో అనేక దేశాలు కమ్యూనిజం సిద్ధాంతం వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు.పేదల భూములను లాక్కోవడం అన్యాయమని, అలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులేనని కూనమనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం కల్లూరు వెంకటేశ్వర్లు తోపాటు తదితరులు పాల్గొన్నారు.






