గ్రామాభివృద్ధికి మరో ముందడుగు

by Taduka Kalyani |

షాబాద్ మండలం లింగారెడ్డి గూడ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే కాలె యాదయ్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

గ్రామాభివృద్ధికి మరో ముందడుగు
X

దిశ, షాబాద్: షాబాద్ మండలం లింగారెడ్డి గూడ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే కాలె యాదయ్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ పొన్న సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 45 లక్షల హెచ్ఎండిఏ నిధులతో గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు.గ్రామాల అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఇతర కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Next Story