- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
అల్పపీడనం, ఆ తర్వాత వాయుగుండం ప్రభావంతో కొద్దిరోజులుగా రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది.

దిశ, వెబ్‌డెస్క్: అల్పపీడనం, ఆ తర్వాత వాయుగుండం ప్రభావంతో కొద్దిరోజులుగా రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. అడపా దడపా మోస్తరు వర్షాలు కురుస్తుండగా రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కూడా రాష్ట్రంలో వాతావరణం చల్లగా ఉంటుందని, ఒకట్రెండు చోట్ల మాత్రం కాస్త ఉష్ణోగ్రత ఎక్కువగా అనిపిస్తుందని APSDMA పేర్కొంది. శుక్రవారం మేఘావృతమైన వాతావరణంతోపాటు ఉత్తరాంధ్ర, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్సున్నట్లు వివరించారు. వర్షాల సమయంలో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగుల వద్ద నిలబడవద్దని సూచించారు. ప్రస్తుతం పార్వతీపురం, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా.. చల్లని గాలులు వీస్తున్నాయి. కాగా.. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పోలవరం జిల్లాలో ఆదివారం వరకూ మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.






