గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలి

by Taduka Kalyani |

గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం గ్రామ స్థాయి అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించాలని భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నారు.

గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలి
X

దిశ, భద్రాచలం : గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం గ్రామ స్థాయి అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించాలని భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GPDP) రూపకల్పనపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, రహదారులు, ఉపాధి కల్పన వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించే అభివృద్ధి ప్రణాళికల ద్వారా గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story