- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పటి వరకు రేవంత్ రెడ్డే సీఎం.. అద్దంకి దయాకర్ షాకింగ్ కామెంట్స్
కేటీఆర్ తన పార్టీని పటిష్టం చేసుకోవడం చాతకాక సెకండరీ ఇన్ఫర్మేషన్‌తో ఒక మోషన్ క్రియేట్ చేసేందుకు తాపత్రేయపడుతున్నాడని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్ తన పార్టీని పటిష్టం చేసుకోవడం చాతకాక సెకండరీ ఇన్ఫర్మేషన్‌తో ఒక మోషన్ క్రియేట్ చేసేందుకు తాపత్రేయపడుతున్నాడని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. 2034 వరకు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని, కేటీఆర్ ఇది రాసుకోవాలని అన్నారు. ఆ తరవాత కాంగ్రెస్ పార్టీని గెలిపించి తాను కేంద్ర రాజకీయాలకు వెళతానని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పడంతో తట్టుకోలేక కేటీఆర్ ఓర్చుకోవడంలేదన్నారు.
ఇప్పటి నుండే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రచారం మొదలు పెట్టడం ద్వారా ఒరిగిందేమీ లేదన్నారు. ఈ ప్రచారం ద్వారా బీజేపీతో పొత్తు కోసమే బీఆర్ఎస్ ఆరాటపడుతోందని విమర్శించారు. కేసీఆర్ బయటకు వచ్చేది లేదు రాజకీయాలు చేసేది లేదని అన్నారు. బీజేపీతో కొట్లాడి సీట్లు పంచుకునేందుకే కేటీఆర్ ఆరాటం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెప్పినట్టుగానే ఫామ్ హౌస్ లో ఉన్నాడని అన్నారు.
హరీష్ రావు తానే సీఎం అవుతానని అనుకుంటున్నాడని, కేటీఆర్ నేను సీఎం అవుతానని అనుకుంటున్నాడని విమర్శించారు. ఏం చేయాలో తెలియని స్థితిలో కేటీఆర్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడని అన్నారు. కాళేశ్వరం ఒక్కటే మీ రాజకీయ భవిష్యత్ ను కూల్చేసిందని విమర్శించారు. కేటీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడేకంటే పార్టీ గురించి కష్టపడితే ఏమైనా మనుగడ ఉంటుందని సూచించారు. రాబోయే రోజుల్లో దేశంలో సైతం కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు.






