- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధనుష్ ‘OM’ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు.. పోస్ట్‌తో హైప్ పెంచిన దర్శకుడు
ఓమ్ సినిమా ప్రపంచం మరింత పెద్దదిగా, పవర్‌ఫుల్‌గా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నసీరుద్దీన్‌తో దర్శకుడు రాజ్ కుమార్ తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రాజ్ కుమార్ పెరియసామి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘ఓమ్’. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. నిజ జీవిత సంఘటన ఆధారంగా, ఎందో వైవిధ్యభరితమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై భారీ అంచనాలను పెంచగా.. తాజాగా, చిత్రబృందం ఓ భారీ అప్‌డేట్ ఇచ్చారు .
ఈ ప్రాజెక్ట్‌లో సరికొత్తగా మరో పవర్‌హౌస్ పర్ఫార్మర్ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ దిగ్గజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నసీరుద్దీన్ షా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు మూవీమేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఓమ్ సినిమా ప్రపంచం మరింత పెద్దదిగా, పవర్‌ఫుల్‌గా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నసీరుద్దీన్‌తో దర్శకుడు రాజ్ కుమార్ తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ధనుష్ కెరీర్‌లో 55వ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.






