- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మైసా’ కోసం రష్మిక భారీ సాహసం.. మొట్టమొదటి హీరోయిన్‌గా రికార్డ్!
వరుసగా రెండు రోజుల పాటు దాదాపు 20 గంటల సమయం ఆమె నీటిలోనే గడుపుతూ ఈ ఫైట్ సీన్స్ చేశారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఒక హీరోయిన్ ఇలాంటి ‘అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్’ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో రష్మిక ఒక గోండ్ తెగకు చెందిన గిరిజన యువతిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆమె ఎంతో ఎమోషనల్ గానే కాకుండా, శారీరకంగా కూడా చాలా కష్టపడుతున్నారు. తాజాగా ఆమె ఈ సినిమా కోసం చేసిన ఒక సాహసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘మైసా’ కోసం రష్మిక ఒక అత్యంత కష్టమైన, ప్రమాదకరమైననీటి అడుగున ఫైట్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు.
వరుసగా రెండు రోజుల పాటు దాదాపు 20 గంటల సమయం ఆమె నీటిలోనే గడుపుతూ ఈ ఫైట్ సీన్స్ చేశారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఒక హీరోయిన్ ఇలాంటి ‘అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్’ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇంత రిస్క్ ఉన్నప్పటికీ రష్మిక ఎక్కడా డూప్ వాడటానికి ఒప్పుకోలేదట. సీన్ ఎంతో రియలిస్టిక్ గా రావాలనే ఉద్దేశంతో ప్రతి యాక్షన్ మూమెంట్‌ను ఆమె సొంతంగానే చేసినట్లు తెలుస్తోంది. రష్మిక చూపిస్తున్న ఈ డెడికేషన్ చూసి సినిమా టెక్నికల్ టీమ్ ,అండర్ వాటర్ క్రూ మొత్తం షాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ నీటి అడుగున జరిగే ఫైట్ కేవలం ఒక యాక్షన్ సీన్ మాత్రమే కాదని, ఎంతో భారీ స్థాయిలో ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ సినిమాకే అతిపెద్ద విజువల్ హైలైట్‌గా నిలవబోతోందని సమాచారం.






