- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొర్రెల కాపరికి దొరికిన జింక పిల్లను అటవీ శాఖకు అప్పగింత
by Taduka Kalyani |
కంగ్టి గ్రామ శివారులో గొర్రెల కాపరికి దొరికిన జింక పిల్లను స్థానిక అధికారులు, గ్రామ సర్పంచ్ సమన్వయంతో అటవీ శాఖ అధికారులకు సురక్షితంగా అప్పగించారు.

X
దిశ, కంగ్టి: కంగ్టి గ్రామ శివారులో ఓ గొర్రెల కాపరికి జింక పిల్ల దొరికింది. వెంటనే అతను స్థానిక అధికారులకు సమాచారం అందించడంతో స్పందించిన ఎమ్మార్వో గంగాభవాని, ఎంపీవో లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కృష్ణ ముదిరాజ్ జింక పిల్లను సురక్షితంగా అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అనంతరం ఫారెస్ట్ సిబ్బంది భీమ్లా నాయక్ జింక పిల్లను తమ ఆధీనంలోకి తీసుకుని అవసరమైన సంరక్షణ చర్యలు చేపట్టారు. అడవి జంతువులు గ్రామాల్లో కనిపించినప్పుడు వాటికి ఎలాంటి హాని కలిగించకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.
Next Story






