- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులపై అంబటి సంచలన వ్యాఖ్యలు
ఉండవల్లి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఆయన లేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అపాయింట్ మెంట్ ఇచ్చి తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఎలా లేరని చెబుతారని ఆయన ప్రశ్నించారు..

దిశ, వెబ్ డెస్క్: ఉండవల్లి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఆయన లేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అపాయింట్ మెంట్ ఇచ్చి తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఎలా లేరని చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఉండవల్లిలో పోలీసు కానిస్టేబుల్ తలకు 14 కుట్లు పడేలా గాయం అయినా కేసు ఎందుకు పెట్టడం లేదని, నిందితుడిని ఇప్పటివరకూ గుర్తించలేదని అంబటి ఆరోపించారు. కానీ రాయి విసిరిన వ్యక్తి కిరణ్ అనే విషయం పోలీసులకు తెలుసు అని చెప్పారు. పోలీసులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలా అంటే లోకేశ్ పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నంచారు. వినతి పత్రం ఇస్తామని ముందుగానే అపాయిమెంట్ తీసుకుంటే ఎస్పీ లేరని ఏఎస్పీకి ఇవ్వాలని సూచించారని అంబటి అసహనం వ్యక్తం చేశారు. ఉండవల్లిలో తమపైనే దాడి జరిగిందని, కేసులు కూడా తమపైనే అయ్యాయని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.






