- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా క్రికెట్ గణాంకాలు బోగస్?.. సీబీఐ విచారణ కోరిన టీసీఏ
జిల్లా క్రికెట్ గణాంకాల వ్యవహారంపై సీబీఐతో స్వతంత్ర విచారణ జరపాలని టీసీఏ డిమాండ్ చేసింది.

దిశ, సికింద్రాబాద్: జిల్లా క్రికెట్ కార్యకలాపాలకు సంబంధించిన తప్పుడు గణాంకాలను సృష్టించి బాంబే హైకోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో పాటు ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా స్వతంత్ర విచారణ చేపట్టాలని టీసీఏ డిమాండ్ చేసింది. టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి గురువారం విడుదల చేసిన ప్రకటనలో, హెచ్‌సీఏ తరఫున కోర్టుకు సమర్పించిన జిల్లా క్రికెట్ నివేదికలో పలు తీవ్రమైన లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. వేర్వేరు జిల్లాల్లో నిర్వహించిన టోర్నమెంట్లకు ఒకే సంఖ్యలో మ్యాచ్‌లు చూపించడం, 2025-26 సీజన్ నివేదికలో 2024-25 శీర్షికలు ఉండడం, కొన్ని కేంద్రాల్లో ఆటగాళ్ల సంఖ్యను 'సున్నా'గా నమోదు చేయడం వంటి అంశాలు నివేదిక విశ్వసనీయతపై అనుమానాలు కలిగిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి పేరుతో బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల వినియోగంపై కూడా పూర్తి వివరాలు వెల్లడించాలని టీసీఏ కోరింది. సంబంధిత ఆర్థిక రికార్డులు, టోర్నమెంట్ షెడ్యూళ్లు, స్కోర్‌బుక్కులు, ఫోటోలు తదితర ఆధారాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కోర్టుకు తప్పుడు సమాచారం సమర్పించడం తీవ్రమైన విషయం అని, ఇది కోర్టు అవమానం, పెర్జురీ వంటి నేరాలకు దారితీయవచ్చని గురువారెడ్డి హెచ్చరించారు. హెచ్‌సీఏపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు.






