- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజస్థాన్‌లో దారుణం.. ఉద్యోగం కోసం తల్లిని చంపిన కూతురు
రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్న కూతురే తల్లిని హత్య చేసింది. ఈ ఘటన జైపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోర్టులో లోయర్ డివిజన్ క్లర్క్‌గా పనిచేస్తున్న 45ఏళ్ల నీరజ్ శర్మ జూలై 3న జైపూర్‌లోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మరణించింది.

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్న కూతురే తల్లిని హత్య చేసింది. ఈ ఘటన జైపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోర్టులో లోయర్ డివిజన్ క్లర్క్‌గా పనిచేస్తున్న 45ఏళ్ల నీరజ్ శర్మ జూలై 3న జైపూర్‌లోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మరణించింది. నీరజ్ శర్మ తన కుమారుడిని కోచింగ్ సెంటర్‌లో దింపి ఇంటికి వస్తున్న సమయంలో 130 కిలోమీటర్ల వేగంతో వస్తున్న స్కార్పియో కారు ఆమెను బలంగా ఢీ కొట్టింది. కారు ఢీ కొట్టడంతో దాదాపు 100 అడుగుల ఎత్తుకు ఎగిరిపడటంతో నీరజ్ శర్మ అక్కడికక్కడే మరణించింది.
ప్రమాదం తరవాత డ్రైవర్ అక్కడ నుండి పరార్ అయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు వాహనం అతివేగంగా వచ్చి ఢీ కొట్టడం చూసిన తరవాత ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా అనుమానం వచ్చింది. దాంతో తమ స్టైల్ లో విచారణ మొదలుపెట్టారు. నీరజ్ శర్మ కూతురు ఆయుషి శర్మ తన తల్లిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ తో రూ.7 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్టు గుర్తించారు. తండ్రి చనిపోయిన తరవాత ప్రభుత్వ ఉద్యోగం తనకు వస్తుందని భావించగా తన తల్లి ఉద్యోగం చేసేందుకు సిద్ధం అవ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తేలింది.
దీంతో ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆయుషి తన తల్లిని అడ్డు తొలగించుకోవాలని భావించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తన మామ మోహన్, కజిన్ తో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్టు తేలింది. ఈ కేసులో మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయుశి తన తల్లి ఉద్యోగం కోసం పలుమార్లు గొడవపెట్టుకుందని ఆమె మేనమామ పోలీసులకు తెలిపాడు. పలుమార్లు తల్లిని హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు తెలిపాడు. దీనిపై గతంలో తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పాడు.






