- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ స్కామ్.. సీబీఐ తొలి ఛార్జ్‌షీట్ దాఖలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) బ్యాంక్ మోసం కేసులో CBI తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) బ్యాంక్ మోసం కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కీలక అడుగు వేసింది. పబ్లిక్ సెక్టార్ (ప్రభుత్వ రంగ) బ్యాంకులను మోసం చేసి, భారీ నష్టాలు చేకూర్చిన ఈ కుంభకోణానికి సంబంధించి గురువారం (జూలై 9, 2026) ముంబైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట దర్యాప్తు సంస్థ తన తొలి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థతో పాటు నలుగురు కీలక వ్యక్తులను నిందితులుగా చేర్చారు.
నిధుల మళ్లింపుపై సీబీఐ సంచలన నిజాలు
సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ప్రకారం.. నిందితులు నేరపూరిత కుట్ర, మోసపూరిత ఉద్దేశంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి సేకరించిన రుణ నిధులను పక్కదారి పట్టించారు. నిబంధనలు, షరతులను పూర్తిగా ఉల్లంఘిస్తూ.. దళారీ సంస్థలు, షెల్ కంపెనీల (Conduit entities) ద్వారా ఈ నిధులను రిలయన్స్ ఏడీఏ (Anil Dhirubhai Ambani) గ్రూప్‌కు చెందిన వివిధ సంస్థల్లోకి అక్రమంగా మళ్లించినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. తద్వారా రుణాలిచ్చిన బ్యాంకులకు భారీగా నష్టం చేకూర్చి, నిందితులు, వారి అనుబంధ సంస్థలు అక్రమంగా లబ్ధి పొందాయని సీబీఐ ఛార్జ్ షీట్‌లో స్పష్టం చేసింది.
ఛార్జ్‌షీట్‌లో ఉన్న నిందితులు వీరే:
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) కార్పొరేట్ సంస్థ.
రవీంద్ర సుధాల్కర్ - ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ.
కృష్ణన్ గోపాలకృష్ణన్ అయ్యర్ - ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ చీఫ్ రిస్క్ ఆఫీసర్.
ధనంజయ్ భగవాన్‌ప్రసాద్ తివారీ - రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ చీఫ్ క్రెడిట్ & రిస్క్ ఆఫీసర్.






