- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TCS: టీసీఎస్‌లో భారీ నియామకాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ 9,279 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. గతేడాది కాలంలో ఇదే అత్యధిక త్రైమాసిక నియామకాలని కంపెనీ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వృద్ధిపై విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ 9,279 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. గతేడాది కాలంలో ఇదే అత్యధిక త్రైమాసిక నియామకాలని కంపెనీ తెలిపింది. దీంతో సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,93,798కు చేరింది. 2025-26లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించిన తర్వాత ఇప్పుడు మళ్లీ నియామకాల వేగం పెంచడం ద్వారా భవిష్యత్తు డిమాండ్‌కు సిద్ధమవుతున్నట్లు కంపెనీ సంకేతాలు ఇచ్చింది. ఇదే సమయంలో ఉద్యోగుల అట్రిషన్ రేటు కూడా 13.7 శాతం నుంచి 13.6 శాతానికి తగ్గింది. ప్రస్తుతం 3.12 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారని కంపెనీ వెల్లడించింది.
ఆర్థిక ఫలితాల్లోనూ టీసీఎస్ మెరుగైన గణాంకాలను నమోదు చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల నుంచి టెక్నాలజీ సేవలకు డిమాండ్ పెరగడంతో సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.13,349 కోట్లు, ఆదాయం రూ.72,275 కోట్లకు చేరాయి. ఆదాయం వార్షిక ప్రాతిపదికన 14 శాతం పెరిగింది. షేర్‌హోల్డర్లకు ప్రతి షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన టీసీఎస్, ఏఐ ఆధారిత సేవలు తమ వ్యాపారంలో వేగంగా విస్తరిస్తున్నాయని, ఈ విభాగం నుంచి వార్షిక ఆదాయం ఇప్పటికే 2.6 బిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొంది.






