- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర విధానాన్నే రాష్ట్రంలోనూ అమలు: రవాణా శాఖ
ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తవుతోంది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC)ని ప్రైవేటీకరిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తవుతోంది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు(Transport Department Special Chief Secretary Krishna Babu) స్పందించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ(RTC Privatization) వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసే ఆలోచనేది లేదన్నారు. వదంతులు నమ్మొద్దని కృష్ణబాబు పిలుపునిచ్చారు.
ఆర్టీసీ బలోపేతమే లక్ష్యం
‘‘ఆర్టీసీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా ఆర్టీసీలో కొత్తగా 750 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నాం. పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ బస్సులు నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారమే కొత్త బస్సుల నిర్వహణ ఉంటుంది. కేంద్ర నిబంధనలు, పద్ధతులనే రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నాం. ’’ అని కృష్ణబాబు పేర్కొన్నారు.






