- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత
సీఎం పర్యటన నేపథ్యంలో రైతు ఆశీర్వాద సభకు భద్రతా ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ బందోబస్తు సిబ్బందికి కీలక సూచనలు చేశారు.

దిశ, ఖమ్మం క్రైం : రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, జగన్నాధపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభకు విచ్చేయనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమైన పోలీస్ కమిషనర్ సునీల్ దత్ భద్రతా ఏర్పాట్లు, విధుల నిర్వహణ, సమన్వయంపై సమగ్ర దిశానిర్దేశం చేశారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులకు, సిబ్బందికి సభ వేదిక సమీపంలో ప్రత్యేక బ్రీఫింగ్ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సభా ప్రాంగణం మొదలు, హెలిప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలు ఇతర కీలక ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పోలీస్ అధికారులతో సమీక్షించారు.ముఖ్యమంత్రి పర్యటన భద్రతా ఏర్పాట్లలో భాగంగా సుమారు 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేటాయించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని, విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తం గా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని సీపీ సూచించారు. పోలీసు అధికారులకు విధి నిర్వహణలో పాటించాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం, వీఐపీ భద్రత తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీ లు సారంగపాణి, తిరుపతి రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.






