వేములవాడ-కరీంనగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

by velandi.Saikiran |

వేములవాడ- కరీంనగర్ ప్రధాన రహదారిలోని అనుపురం ఆర్అండ్ఆర్ కాలనీ (ఇస్లాం నగర్) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

వేములవాడ-కరీంనగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
X

దిశ, వేములవాడ టౌన్: వేములవాడ- కరీంనగర్ ప్రధాన రహదారిలోని అనుపురం ఆర్అండ్ఆర్ కాలనీ (ఇస్లాం నగర్) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేములవాడ వైపు నుంచి కొదురుపాక వైపు బీహార్ కూలీలతో వెళ్తున్న టాటా ఎస్ వాహనాన్ని సిరిసిల్ల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సు వెనక నుండి ఢీ కొట్టింది. ఈ త‌రుణంలోనే టాటా ఎస్ వాహనం బోల్తా పడి అందులో ఉన్న నలుగురూ కూలీలు మృతి చెందగా మరికొంతమంది గాయాల‌పాలు అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అల‌ర్ట్ అయి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో క్షతగాత్రులను సమీపంలోని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన జరిగిన తీరుపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story