అమెరికాలో భార్యను చంపిన తెలంగాణ టెకీ.. వెలుగులోకి సంచలన విషయాలు

by Ajay Maddhiboyina |

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఆ దేశంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన అవినాష్ నార్నె అనే వ్యక్తి తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అవినాష్ కు 2025 జూన్ 5న రాజిత సబ్బినేని అనే మ‌హిళ‌తో వివాహం జ‌రిగింది.

అమెరికాలో భార్యను చంపిన తెలంగాణ టెకీ.. వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఆ దేశంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన అవినాష్ నార్నె అనే వ్యక్తి తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అవినాష్ కు 2025 జూన్ 5న రాజిత సబ్బినేని అనే మ‌హిళ‌తో వివాహం జ‌రిగింది. అదే ఏడాది అవినాష్ భార్య‌ను గొంతు నులిమి హ‌త్య చేశాడు. ఆపై కేసు నుండి త‌ప్పించుకునేందుకు తాను బాత్రూం వెళ్లి వ‌చ్చే లోప‌ల త‌న భార్య గ‌దికి లాక్ చేసుకుంద‌ని త‌లుపు తీయ‌డం లేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వ‌చ్చి త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టి రాజిత‌ను బ‌య‌ట‌కు తీసి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే ఆమె మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు తెలిపారు. కాగా పోస్టుమార్టం రిపోర్టులో రాజితది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని, ఆమె గొంతునొక్కి హ‌త్య చేశార‌ని పోలీసులు గుర్తించారు.

కేసు న‌మోదు చేసి విచారించగా భ‌ర్త‌నే రాజిత‌ను హ‌త్య చేసి డెడ్ బాడీ ఫోటోను ఇండియాలో ఉన్న అత‌డి ప్రియురాలికి పంపిన‌ట్టు గుర్తించారు. రాజిత‌ను చంపిన రోజు ఆమెకు అవినాష్ నాలుగుసార్లు ఫోన్ చేసిన‌ట్టు గుర్తించారు. అవినాష్, రాజిత పెళ్లికి కూడా అతడి ప్రియురాలు హాజరైనట్టు విచారణలో వెల్లడైంది. చాలా కాలంగా సదరు యవుతితో అవినాష్ కు సంబంధం ఉన్నట్టు తేలింది. అంతే కాకుండా రాజిత వాట్సప్ చాట్ లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తనకు ఇచ్చే డ్రింక్స్, జ్యూస్ లు చాలా చేదుగా ఉన్నాయి అంటూ రాజిత పలుమార్లు అవినాష్ కు సందేశాలు పంపింది. చనిపోయే రోజు కూడా నువ్వు ఇచ్చిన స్మూతీ చేదుగా, ట్యాబెట్లు కలిపి ఇచ్చినట్టు ఉందని మెసేజ్ చేసినట్టు విచారణలో తేలింది. ఈ కేసులో అవినాష్ పై జూలై 5న ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే అతడికి జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది.

Next Story