- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొలకెత్తని సోయా.. ధర్నాకు దిగిన రైతులు..!
సర్వే ప్రక్రియ పరిశీలన కోసం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం కుబీర్ మండలానికి వచ్చిన విషయం తెలుసుకున్న మొలకెత్తని సోయా రైతులు వివేకానంద చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు.

దిశ, కుబీర్ : సర్వే ప్రక్రియ పరిశీలన కోసం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం కుబీర్ మండలానికి వచ్చిన విషయం తెలుసుకున్న మొలకెత్తని సోయా రైతులు వివేకానంద చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. కలెక్టర్ తిరిగి వెళ్లే సమయంలో రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకుని కొద్దిసేపు తన వాహనాన్ని ఆపించారు. అనంతరం రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సాగు సమయం మించిపోతుండటంతో మళ్లీ విత్తనాలు వేసినా దిగుబడి తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
అందువల్ల విత్తనాల స్థానంలో నగదు రూపంలోనే పరిహారం అందించాలని కోరారు. పరిహారం అందించే ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, విత్తనాల నాణ్యతను పరీక్షించేందుకు నమూనాలను ప్రయోగశాలకు (ల్యాబ్) పంపించామని, నివేదిక వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని మండల వ్యవసాయ అధికారిణి (ఏఈఓ) సారికను ఆదేశించారు. ఈ సందర్భంగా సంబంధిత విత్తనాల కంపెనీ నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.






