క్యాన్సర్‌తో కొడుకు మృతి.. కోడలికి కన్యాదానం చేసిన మామ

by Ajay Maddhiboyina |

కొడుకు మ‌ర‌ణిస్తే అత‌డిని పెళ్లి చేసుకుని న‌మ్ముకుని వ‌చ్చిన కోడ‌లికి చిల్లిగ‌వ్వ ఆస్తి కూడా ఇవ్వ‌కూడ‌ద‌ని అనుకునే అత్తామామలు చాలామంది ఉంటారు. కొడుకు పోయాక నువ్వెందుకు అంటూ మాట్లాడ‌తారు.

క్యాన్సర్‌తో కొడుకు మృతి.. కోడలికి కన్యాదానం చేసిన మామ
X

దిశ‌, వెబ్ డెస్క్: కొడుకు మ‌ర‌ణిస్తే అత‌డిని పెళ్లి చేసుకుని న‌మ్ముకుని వ‌చ్చిన కోడ‌లికి చిల్లిగ‌వ్వ ఆస్తి కూడా ఇవ్వ‌కూడ‌ద‌ని అనుకునే అత్తామామలు చాలామంది ఉంటారు. కొడుకు పోయాక నువ్వెందుకు అంటూ మాట్లాడ‌తారు. కానీ త‌న కొడుకు మ‌ర‌ణించిన త‌ర‌వాత కోడ‌లి జీవితం వృథా అవ్వొద్దు అంటూ ఓ మామ ఆమెకు క‌న్యాధానం చేసి గొప్పమ‌న‌సు చాటుకున్నాడు. వివ‌రాల్లోకి వెళితే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన దినేష్ భైరాగి కుమారుడు క‌పిల్ కు ప్రియాంక అనే యువ‌తితో వివాహం జ‌రిగింది. వివాహం త‌ర‌వాత ప్రియాంక క‌పిల్, అత‌డి కుటుంబానికి ఎంత‌గానో ద‌గ్గ‌రైంది. వారితో క‌లిసిమెలిసి ఉంటూ కుటుంబంలో క‌లిసిపోయింది. ఎంతో సంతోషంగా ఉంటున్న ఆ కుటుంబంలో క‌పిక్ క్యాన్స‌ర్ బారిన‌ప‌డ‌టం తీర‌ని దుఃఖాన్ని నింపింది.

అయిన‌ప్ప‌టికీ ప్రియాక వెన‌క‌డుగు వేయ‌కుండా భ‌ర్త‌కు ధైర్యం చెబుతూ అత‌డి ట్రీట్మెంట్ స‌మ‌యంలో అండ‌గా ఉంది. అయిన‌ప్ప‌టికీ క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి క‌పిల్ ను 2024లో బ‌లితీసుకుంది. కొడుకు మ‌ర‌ణించిన త‌ర‌వాత కోడిలి గురించి మాకు ఎందుకు అనుకోకుండా క‌పిల్ తండ్రి దినేష్ ఆమెకు మ‌రో సంబంధం చూశాడు. మ‌రో పెళ్లి చేసేందుకు ప్రియాంక తండ్రిని కూడా ఒప్పించారు. అక్క‌డితో ఆగ‌కుండా పెళ్లి ఖ‌ర్చు మొత్తం తానే పెట్టుకుని కోడలికి పెళ్లి చేసి కన్యాధానం చేశాడు. త‌న‌కు ప్రియాంక కోడ‌లు కాద‌ని ఇప్ప‌టి నుండి కూతురు అని చెబుతున్నాడు. దీనికి సంబంధించిన స్టోరీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో మామ చేసిన ప‌నికి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

Next Story