- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం మత్తులో స్కూల్ వ్యాన్ డ్రైవర్..తృటిలో తప్పిన ప్రాణాపాయం
విద్యార్థులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో వారి ప్రాణాలతో చెలగాటమాడాడు.

దిశ, పెద్దపల్లి : విద్యార్థులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో వారి ప్రాణాలతో చెలగాటమాడాడు. అతడి నిర్లక్ష్యం కారణంగా 40 మంది విద్యార్థులతో వెళ్తున్న వ్యాన్... అదుపుతప్పి విద్యుత్ స్తంభంతో పాటు చెట్టును ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో విద్యార్థులెవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మంగపేట గ్రామం నుండి పెగడపల్లిలో ఉన్న 'సన్ షైన్' పాఠశాలకు సుమారు 40 మంది విద్యార్థులతో ఉదయం స్కూల్ వ్యాన్ బయలుదేరింది. అయితే వాహనం నడుపుతున్న డ్రైవర్ అప్పటికే తీవ్ర మద్యం మత్తులో ఉన్నాడు. మార్గమధ్యంలో స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్ వేగంగా వెళ్లి ముందుగా ఓ విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత పక్కనే ఉన్న చెట్టును గుద్దుకుని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులెవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన సదరు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.






