- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి భగీరథ్‌కు బెయిల్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
బండి భగీరథ్ బెయిల్ పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. మిత్రుడు అంటే రేవంత్ రెడ్డిలా ఉండాలని, బండి సంజయ్ పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్ పంపించారని అన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో భగీరథ్ కు బెయిల్ రావడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: బండి భగీరథ్ బెయిల్ పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. మిత్రుడు అంటే రేవంత్ రెడ్డిలా ఉండాలని, బండి సంజయ్ పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్ పంపించారని అన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో భగీరథ్ కు బెయిల్ రావడం బాధాకరం అని వ్యాఖ్యానించారు. కానీ హైకోర్టు తీర్పును గౌరవించాలన్నారు. ఇన్నాళ్లు ఈ తెలంగాణ పసి బిడ్డను ప్రజలూ, ఈ న్యాయ వ్యవస్థనే కాపాడాయని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వుల్టా ఈ బిడ్డను హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ చేయాలని చూసిందని ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, నిందితున్ని ఎలాగైనా బెయిల్ ఇప్పించి కాపాడాలన్న ఉత్సుకత కొట్టొచ్చినట్టు కనబడిందని ఆరోపించారు. ఈ వ్యవహారం మొత్తం మైనర్ అమ్మాయిల భధ్రత పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ చిత్తశుద్ధిని, మైనర్ అమ్మాయిల రక్షణ పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరును సూచిస్తుందన్నారు.
హోంమంత్రి రేవంత్ రెడ్డి నేటికీ బాధితురాలిని పరామర్శించకపోవడం దీనికి స్పష్టమైన సంకేతమని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్నో కేసుల్లో స్పెషల్ పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్) ని నియమించినా ఈ కేసులో మాత్రం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించిందని, కనీసం SIT కూడా వేయలేదన్నారు. నిందితునికి రహస్యంగా పరీక్షల పేరిట మధ్యంతర బెయిల్ వచ్చినపుడే, రేవంత్ రెడ్డి- బండి సంజయ్ ల బలమైన మైత్రి బంధం బయటపడిందని అన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర హోం మంత్రిగా,బండి సంజయ్ కేంద్ర హోం మంత్రిగా ఉన్నంత కాలం బాధిత మైనర్ అమ్మాయికి న్యాయం జరగదని పేర్కొన్నారు. ఈ చర్యతో ప్రభుత్వం ఎంతో మంది అమ్మాయిల, తల్లిదండ్రుల మనో ధైర్యాన్ని దెబ్బ తీసిందని మండిపడ్డారు. బాధితుల తరపున నిలబడాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ తరపు న్యాయవాదులు నిందితుని తరపున నిలబడ్డారన్నారు.
బాధిత బాలిక ఒక ప్రైవేటు లాయర్ ను ఆశ్రయించక పోయుంటే ఈ కేసు ఎప్పుడో నీరుగారిపోయేదని మండిపడ్డారు. మధ్యంతర బెయిల్ వచ్చినపుడు, ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించిన తీరు చూసి, మిగతా న్యాయవాదులంతా ముక్కున వేలేసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. అయితే,ఇదంతా కేవలం ముఖ్యమంత్రి,హోం మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగిందన్నది నిప్పు లాంటి నిజం అని ఆరోపించారు. 10 నుండి 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సిన నిందితుడు, నేడు బెయిల్ పై బయటకు రాబోతున్నాడని అన్నారు. నిందితుడు ప్రభుత్వం ఇచ్చిన అభయంతో ఇంకా ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని ఘాతుకాలకు పాల్పడుతాడో ఊహించలేమని పేర్కొన్నారు. ఏదేమైనా ఈ మైనర్ బాలికను కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్ తెలంగాణ సమాజానిదేనని, ఆమె భవిష్యత్ లో న్యాయం కోసం చేసే ఏ పోరాటానికైనా మనం అందరం ఆమెకు బాసటగా నిలబడాలన్నారు.






