- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీ అన్నను జైలుకు పంపుతా.. ఖబర్దార్ తోపుదుర్తి: ఎమ్మెస్ రాజు వార్నింగ్
తనపై లేని పోని ఆరోపణలను చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌పై మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మండిపడ్డారు. ..

దిశ, వెబ్ డెస్క్: తనపై లేని పోని ఆరోపణలను చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌పై మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మండిపడ్డారు. తాను అద్దెకు ఉంటున్న ఇంటిని ఎమ్మెస్ రాజు కొనుగోలు చేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఆ స్థాయిలో సంపాదించారంటూ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేసిన ఆరోపణలపై సవాల్ విసిరిన నేపథ్యంలో జరిగిన పరిణామాలపై ఆయన స్పందించారు. సమాజంలో తన ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ప్రకాశ్ రెడ్డిని వదిలిపెట్టే పరిస్థితిలేదన్నారు. ప్రకాశ్ రెడ్డికి, తనకు మాత్రమే యుద్ధమని హెచ్చరించారు. రాజకీయంగానైనా, వ్యక్తిగతంగానైనా సరే ఇది జీవితాకాలం, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రకాశ్ రెడ్డిని వేటాడతానని వార్నింగ్ ఇచ్చారు.
ఇక నుంచి....
రాయలసీమలో రెడ్డికి, రెడ్డికి- రెడ్డికి, కమ్మకి మధ్య ఫ్యాక్షన్ గొడవ ఉంటుందని, ఇక నుంచి ప్రకాశ్‌కు ఎమ్మెస్ రాజు మాదిగకు ఉంటుందని హెచ్చరించారు. లేని ఆరోపణలు చేసి తన ఆత్మగౌరవంపై ప్రకాశ్ రెడ్డి దెబ్బకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికొచ్చానని తెలిపారు. ఇప్పుడున్న పదవులు ఉండొచ్చని, పోవచ్చని, కానీ తాను మాత్రం పసుపు సైనికుడినని చెప్పారు. తోపుదుర్తితో పాటు మరో వ్యక్తి రెండు ఇళ్లలో అద్దెకు ఉండి డబ్బులు చెల్లించని పరిస్థితి ఉందన్నారు. సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు అద్దె ఇంట్లో ఉండి డబ్బులు చెల్లించకుండా ఉండేందుకు సిగ్గుందా అని ఎమ్మెస్ రాజు ప్రశ్నించారు. నమ్మి ఇల్లు అద్దెకు ఇస్తే ఓనర్లకు చుక్కలు చూపిస్తారా అని నిలదీశారు. తోపుదుర్తిది నీచమైన చరిత్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబంపై నీచాతినీచంగా మాట్లాడిన తోపుదుర్తి అన్న చంద్రశేఖర్ రెడ్డిని జైలుకు పంపుతానని ఎమ్మెస్ రాజు హెచ్చరించారు.






