మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ముద్దు ముద్దు మాటలకు మురిసిపోయిన సీఎం

by Prasad Jukanti |   (  Updated:2026-07-09 12:52:48  IST  )

బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి తన మనవడు రుద్రదేవ్ కోసం వంటగదిలోకి వెళ్లి స్వయంగా పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ముద్దు ముద్దు మాటలకు మురిసిపోయిన సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పరిపాలన, రాజకీయ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాసేపు తన మనవడి కోసం గరిటె పట్టారు. "తాతా.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు ముద్దు ముద్దుగా అడగడంతో మనవడి కోసం కిచెన్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్వయంగా షెఫ్‌గా మారిపోయారు. మనవడి కోసం తాను పూరీలు చేస్తున్న మధుర క్షణాలకు సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చారు: "‘తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా’ అని మనవడు అడిగితే తప్పుతుందా? పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు... బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

క్యూట్ వీడియో వైరల్:

ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే విపరీతంగా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా.. మనవడికి మాత్రం తాతేనని, నిత్యం ప్రజాసేవలో అలసిపోయే మీకు ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు తీపి గుర్తులు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రేవంత్ రెడ్డి ఏకైక కుమార్తె నైమిషా రెడ్డి కుమారుడు అంటే రేవంత్ రెడ్డిని ఎప్పుడూ స్పెషలే. తన మనవడికి వారి అమ్మానాన్న రేయాన్స్ అని పేరు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి మాత్రం స్పెషల్‍గా రుద్రదేవ్ పెట్టుకున్నాడు. తాను తన స్వగ్రామానికి వెళ్లినా, దైవదర్శనాలకు వెళ్లినా తనతో పాటు తన మనవడిని రేవంత్ రెడ్డి వెంట తీసుకుని వెళ్తారు. ఆ సమయంలో తన మనువడిని ఎత్తుకుని అతడితోనే సమయం గడిపేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇటీవలే తన మనువడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో అక్షరాభ్యాసం కూడా చేయించారు. ఇప్పుడు ఏకంగా పూరీలు కావాలని అడగడమే ఆలస్యం రేవంత్ రెడ్డి కిచెన్ రూమ్‍లోకి ఎంట్రీ ఇవ్వడం అక్కడ తన మనువడి ముద్దు ముద్దు మాటలకు మురిసిపోవడం అందరిని ఆకట్టుకుంటోంది.



Next Story