- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ అవినీతి సొమ్మును అమరవీరులకు పంచాలి: కవిత
బీఆర్ఎస్ అకౌంట్‌లోని రూ.1400 కోట్ల అవినీతి సొమ్మును అమరవీరుల కుటుంబాలకు కోటి చొప్పున పంచాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత కవిత అన్నారు. కొత్తగూడెం పీవీకే5 భూగర్భగనిని కవిత నేడు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అకౌంట్‌లోని రూ.1400 కోట్ల అవినీతి సొమ్మును అమరవీరుల కుటుంబాలకు కోటి చొప్పున పంచాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత కవిత అన్నారు. కొత్తగూడెం పీవీకే5 భూగర్భగనిని కవిత నేడు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు అవినీతి సొమ్ము ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చింది కాదా అని ప్రశ్నించారు. ఆ డబ్బును పంచిన తరవాతనే ప్రజల మధ్యకు వచ్చి నిలబడాలని వ్యాఖ్యానించారు. ఎవరివల్ల అవినీతి జరిగిందో వారినే ముందు పెట్టి మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ జన్మలో బాగుపడదని వ్యాఖ్యానించారు. రూ.188 కోట్లతో పయనీర్ పత్రికను బీఆర్ఎస్ కొనుగోలు చేసిందని ఆరోపించారు. తెలుగులో చెప్పిన అబద్దాలు సరిపోనట్టు ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా అబద్దాలు చెబుతారని వ్యాఖ్యానించారు.
అవినీతి గురించి మాట్లాడినందుకే తనను పార్టీలో నుండి తీసేశానని అన్నారు. అయినప్పటికీ తాను ఆగిపోలేదని సొంతంగా పార్టీ పెట్టుకుంటే దానిపై ఎలక్షన్ కమిషన్ కు వెయ్యి ఫిర్యాదులు ఇచ్చారన్నారు. పార్టీ పెట్టుకుంటే భయంలేదని అన్నారని, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. తన వార్తలు రాస్తే ఎందుకు రాశారని కేటీఆర్ ఫోన్లు చేసి అడుగుతున్నారని ఆరోపించారు. తాను ఎప్పుడూ పర్సనల్ విషయాలు మాట్లాడలేదని, ప్రాణం పోయినా మాట్లాడను అని అన్నారు. జోడెద్దుల్లా పార్టీని నడిపించాల్సినవాళ్లు ప్రజల సమస్యలు మర్చిపోయి దున్నపోతుల్లా తనపై కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రతిఒక్కరికి ఫోన్ చేసి ఉద్యమకారుల వార్తలు రాయకూడదని అంటున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్‌మెంట్ కొనసాగించాలని అన్నారు. నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని, అన్‌ఫిట్ అయిన కార్మికులు కోరుకున్న వారికి ఉద్యోగమిచ్చేలా ఓపెన్ పాలసీ ఉండాలని స్పష్టం చేశారు. నెలకు ఒకసారి మెడికల్ బోర్డు ఉండాలని డిమాండ్ చేశారు. కొరుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చేలా ఓపెన్ పాలసీ ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ నెల 20 నుంచి గోదావరిఖనిలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు.






